తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: తిరుపతి

వినాయక చవితి పండుగ ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 8 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేని సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 61,361 మంది దర్శించుకోగా, హుండీ ఆదాయం రూ.4.7 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.