సినిమాలపై విమర్శల వివాదం: విమర్శకులపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మండిపాటు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడు ఘటన నేపథ్యంలో తన సినిమాలపై వస్తున్న విమర్శలపై ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారని తెలిపారు. సమాజంలో నేరాలు జరిగినప్పుడు సినిమాలను బలిపశువుగా మార్చడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. కొందరు ఈ విషాదాన్ని వ్యక్తిగత కక్షల కోసం వాడుకుంటున్నారని, చిత్ర పరిశ్రమలోని విఫలమైన వ్యక్తులు సామాజిక వేత్తలుగా బిల్డప్ ఇస్తున్నారని మండిపడుతూ బాధితుల పట్ల సానుభూతి చూపాలని ఆయన పేర్కొన్నారు.