బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి అజిత్ అగార్కర్ రాజీనామా
రిపోర్టర్: రాము
స్థలం: India
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ పెద్దలతో తలెత్తిన విభేదాలే ఆయన నిష్క్రమణకు ప్రధాన కారణమని తెలుస్తోంది. 2027 వన్డే ప్రపంచకప్ నాటికి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని అగార్కర్ భావించగా, బోర్డు మాత్రం రోహిత్‌కు మద్దతుగా నిలవడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. అలాగే నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కూడా విధానపరమైన విభేదాలు వచ్చినట్లు సమాచారం.