గ్రూప్-1 జవాబుపత్రాల అక్రమాల దస్త్రాలు అప్పీలుదారులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
రిపోర్టర్: రమేష్
స్థలం: అమరావతి
వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ ఇచ్చిన నివేదికలతో జతచేసిన దస్త్రాలను అప్పీలుదారులకు ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ ను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ డి.రమేశ్, జస్టిస్ హరిహరనాథ శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.