తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు.. ఐఎండీ హైఅలర్ట్!

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తెలంగాణ

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సెప్టెంబర్ 4న తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, హైదరాబాద్ సహా పలు జిల్లాలతో పాటు ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.