భోపాల్‌లో దారుణం: ఏడాది చిన్నారిపై కన్నెత్తి చూసిన కీచక బాబాయి అరెస్ట్
రిపోర్టర్: రమేష్
స్థలం: భోపాల్
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న ఏడాది చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 28 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వంట పనిలో ఉన్న తల్లి గదిలోకి వచ్చి చూడగా, నిందితుడు దారుణానికి పాల్పడుతూ దొరికిపోయాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు.