నగరిలో మాస్టర్ ప్లాన్ ఆవిష్కరణ అభ్యంతరాలకు అవకాశం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

చిత్తూరు, పలమనేరు, కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో నగరి పురపాలక సంఘం ప్రాంతానికి జీఐఎస్ ఆధారిత ముసాయిదా మాస్టర్ ప్లాన్ తయారైంది. మున్సిపల్ కమిషనర్ బాలాజి నాయక్ గురువారం ఈ ప్లాన్ను కార్యాలయంలో ప్రచురించారు. ప్రజలు ఈ నెల 30వ తేదీ లోపు తమ అభ్యంతరాలు, సూచనలను లిఖితపూర్వకంగా తెలపాలని ఆయన కోరారు. తదుపరి చర్యల నిమిత్తం వీటిని సిపికేయూడీఏ అధికారులకు సమర్పిస్తామని తెలిపారు.