పాకిస్థాన్ మ్యాచ్లో భద్రతా వైఫల్యంపై బాబర్ ఆజమ్ ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Islamabad
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఆడుతున్న దేశీయ మ్యాచ్లో తీవ్ర భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ప్రెసిడెంట్స్ ట్రోఫీ మ్యాచ్లో పలువురు అభిమానులు సెక్యూరిటీని దాటి మైదానంలోకి దూసుకొచ్చారు. తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమాని ఫోన్ను బాబర్ ఆజమ్ దూరంగా విసిరివేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో మైదానంలో భద్రతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి అని క్రీడా వర్గాలు వెల్లడించాయి.