విజయనగరంలో అక్రమాల పునాదులు: కుప్పకూలుతున్న ఆచంటా గార్డెన్స్ నిర్మాణ గోడలు
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో గత వైకాపా పాలకవర్గం హయాంలో చేపట్టిన సుందరీకరణ పనుల్ లో భారీ అవినీతి బట్టబయలైందని స్థానిక నిపుణులు పేర్కొన్నారు. పెద్దచెరువు ఆనుకుని రూ.కోటీ యాభై లక్షలతో నిర్మించిన ఆచంటా గార్డెన్స్ నాణ్యతా లోపంతో ప్రస్తుతం దెబ్బతింటోందని, వర్షాలకు గోడలు కుప్పకూలుతున్నాయని తెలిపారు. చెరువుల అభివృద్ధి పేరుతో రూ.కోట్లు ఖర్చు చేశామని లెక్కలు చూపినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు నాసిరకంగా సాగడంతో ప్రజాధనం వృథా అయిందని ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.