రూ.2.13 కోట్లతో పోటుపాలెం తారు రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం
రిపోర్టర్: సతీష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల ప్రజల కల సాకారమవుతోందని పాశం సునీల్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో రూ.2.13 కోట్ల భారీ నిధులతో పోటుపాలెం తారు రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో ఈ ప్రాధాన్యత పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ నిధుల కేటాయింపుతో స్థానిక ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని ఆయన స్పష్టం చేశారు.