ఓటును కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం: ఢిల్లీలో రాహుల్ గాంధీ భారీ ర్యాలీ
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక రామ్లీలా మైదాన్ వేదికగా మహా ర్యాలీని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఓటు హక్కును కాపాడుకుంటూ దేశాన్ని రక్షించుకోవాల్సిన చారిత్రక అవసరం ప్రస్తుతం ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఓటు బచావో, దేశ్ బచావో మహా ర్యాలీ ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన గళం వినిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.