మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం: చెరువులోకి దూసుకెళ్లిన పాఠశాల వాహనం
రిపోర్టర్: నరేష్
స్థలం: మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తిర్లాపురం గ్రామ శివారులో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లి పల్టీ కొట్టిందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ తీవ్ర నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ ఘటనలో వాహనంలో ఉన్న నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయని, స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారని అధికారులు వెల్లడించారు.