సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేత బజార్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, ఆలయ అభివృద్ధి పనులు, రెవెన్యూ కార్యాలయాలు, గోదాముల నిర్మాణానికి శంకుస్థాపన చేసి, ఇందిరా మహిళా శక్తి భవన్‌ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినట్లు కలెక్టర్ రాజన్న సిరిసిల్ల వెల్లడించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వసతులు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పెద్దఎత్తున పాల్గొన్నారు.