స్వగ్రామంలో కుటుంబంతో కలిసి ఓటేసిన ఎమ్మెల్యే కూన రవికుమార్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పొందూరు

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి గ్రామంలో గురువారం నిర్వహించిన పరిషత్ ఎన్నికల్లో ఆమదాలవలస ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ తన ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైన ఆయుధమని, అర్హులైన పౌరులు తమ ఓటును వినియోగించుకుని రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే రవికుమార్ ప్రజలను కోరారు.