శాసనసభ నుంచి బీజేపీ సభ్యుల వాకౌట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ శాసనసభ సమావేశాల మొదటి రోజే వాతావరణం వేడెక్కింది. 22-ఏ భూముల అంశంపై చర్చకు పట్టుబట్టిన బీజేపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ భూముల అక్రమాలపై జ్యుడీషియల్ విచారణ జరపాలని, ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక బయటపెట్టాలని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.