మనుబోలులో బల్ల హరేంద్ర కుటుంబాన్ని పరామర్శించిన కిరణ్ కుమార్ రెడ్డి

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న సర్వేపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బల్ల హరేంద్ర నివాసానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లారు. ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరేంద్రకు పూర్తి మనోధైర్యం కల్పించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.