బెల్లంపల్లి మండలం కన్నాల ఆలయంలో గుర్తుతెలియని దుండగుల భారీ చోరీ

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బుధవారం గుడి తెరిచే సమయంలో ఆలయం, లోపలి హుండీ తాళాలు పగలగొట్టి ఉండడంతో పూజారి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించారు. పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.