విజయవాడలో మరిగే సాంబార్ పాత్రలో పడి మహిళ మృతి
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయవాడ
విజయవాడ నగరంలో వినాయక చవితి అన్నదాన కార్యక్రమం విషాదంగా మారింది. గణేష్ మండపం వద్ద భక్తులకు భోజనాలు వడ్డిస్తున్న సుజాత (46) అనే మహిళ ప్రమాదవశాత్తు మరిగే సాంబార్ పాత్రలో పడి తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.