ఈ గ్రామంలో వినాయక చవితి వేడుకలు ఎందుకు జరుపుకోరు?

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా లచ్చిరాజుపేటలో వినాయక చవితి వేడుకలు జరపరు. దశాబ్దాల క్రితం విగ్రహం పెట్టినప్పుడు వరుస మరణాలు సంభవించడంతో గ్రామస్థులు భయపడి ఈ ఆచారం మానుకున్నారు. అప్పటి నుంచి ఊరిలో విగ్రహాలు ప్రతిష్టించకుండా, పొరుగు ఊర్లకు వెళ్లి పూజలు చేస్తున్నారు. గ్రామ ప్రశాంతత కోసం పెద్దల నిర్ణయం మేరకు ఈ వింత ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.