సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
దేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ పిటిషన్లను ఐదుగురు సభ్యుల బిగ్ బెంచ్‌కు రిఫర్ చేసే అంశంపై ధర్మాసనంలోని జస్టిస్ దీపాంకర్ దత్తా తోసిపుచ్చగా, జస్టిస్ ఎస్‌సీ శర్మ మాత్రం పెద్ద బెంచ్‌కు సిఫారసు చేయాలని స్పష్టం చేశారు.