పొన్కల్ లో ఘనంగా అంగన్ మిలాన్: కేంద్ర సంక్షేమ పథకాలపై అవగాహన
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొన్కల్-3 గ్రామంలో నిర్వహించిన అంగన్ మిలాన్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ఉచిత సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశాలు, గర్భిణులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పలకలు, బాలపాలు అందజేశారు. సిబ్బందిని గుర్తించి ప్రోత్సహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి అంగన్వాడీ టీచర్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.