అమెరికా హెచ్-1బి వీసాదారులకు భారీ షాక్, 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దుకు ప్రతిపాదన!
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమెరికా
అమెరికాలో హెచ్-1బి వీసాపై పనిచేస్తూ ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఉద్యోగం పోయిన తర్వాత అమెరికాలో ఉండేందుకు ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించాలని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. ఇదే అమలైతే టెక్ ఉద్యోగులు తక్షణమే దేశం వీడాల్సి వస్తుంది.