పులివెందులలో ఎన్నికల వేళ ఉద్రిక్తత: కారు, సుమో దగ్ధం

రిపోర్టర్: రాము స్థలం: పులివెందుల

ఎన్నికల పోలింగ్ సమయం మునుపు పులివెందుల శిల్పారామం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు పార్కింగ్ చేసి ఉన్న కారు, సుమోతో పాటు మోటార్ సైకిల్ కు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయాయని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో దగ్ధమైన వాహనాలు ఉలిమెళ్ళ గ్రామానికి చెందిన మధుసూదన్ రెడ్డికి చెందినవిగా గుర్తించామని, ఈ దుశ్చర్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీస్ అధికారులు వెల్లడించారు.