వృద్ధురాలపై దాడి చేసి బంగారం గొలుసు అపహరణ
రిపోర్టర్: గోపి
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం కొట్నాన రామినాయుడువలస గ్రామంలో ఒంటరిగా ఉంటున్న కోడి గౌరమ్మ అనే వృద్ధురాలపై బంకురు శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి చేసి రెండు తులాల బంగారం గొలుసును అపహరించాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి సుత్తితో తలపై దాడి చేయగా బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. స్థానికులు ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, ఎస్సై ఫకృద్దీన్ కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.