వైవాహిక జీవితంలో తీవ్ర క్రూరత్వం: భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్ ఆమోదం
రిపోర్టర్: విజయ్
స్థలం: హిమాచల్ ప్రదేశ్
ఖరీదైన దుస్తులు మరియు మేకప్ వస్తువుల కోసం భర్తపై ఒత్తిడి తెచ్చి, వేధించడం క్రూరత్వం కిందకు వస్తుందని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రా జిల్లా దెహరా ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు భర్త మనీశ్ కుమార్ దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను న్యాయస్థానం ఆమోదించి తీర్పు వెలువరించినట్లు అధికారులు తెలిపారు. భార్య తరఫున ఎలాంటి వాదనలు లేకపోవడంతో సాక్ష్యాల ఆధారంగా కోర్టు ఏకపక్ష విచారణ జరిపి ఈ సంచలన తీర్పును వెలువరించడం గమనార్హం.