సమావేశంలో తనపై దాడి చేసి చంపుతామని బెదిరించారన్న సుమలతా దేవి
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లోని రాఘవ గెస్ట్ హౌస్లో జరిగిన తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసోసియేషన్ అధ్యక్షురాలు వి.వి. సుమలతా దేవిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసి రాజీనామా చేయాలని బెదిరించారు. రికార్డులు అపహరించి, తనను చంపుతామని హెచ్చరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.