బెంగళూరులో ఈడీ ఉచ్చు: కేపీఎస్సీ మాజీ ఛైర్మన్ శివశంకరప్ప అరెస్ట్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Bengaluru

కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల కుంభకోణం కేసులో ఈడీ అధికారులు తీవ్ర చర్యలు తీసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరులోని డాలర్స్ కాలనీలో ఉన్న కేపీఎస్సీ మాజీ ఛైర్మన్ శివశంకరప్ప ఎస్ సాహుకార్ నివాసంలో మంగళవారం సోదాలు నిర్వహించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో కేపీఎస్సీ సభ్యురాలు బి.వి. గీతను కూడా విచారణ నిమిత్తం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టమైంది.