ములుగు కలెక్టరేట్ భవనంలో నాణ్యతా లోపాలు: స్లాబ్లకు పగుళ్లు, గోడల్లోకి తేమ

రిపోర్టర్: శివ స్థలం: ములుగు

ములుగు జిల్లా కేంద్రంలో సుమారు యాభై మూడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనం నిర్మాణ నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రారంభమైన కొద్ది నెలల వ్యవధిలోనే భవనంలో స్లాబ్లకు పగుళ్లు ఏర్పడటం మరియు గోడల్లోకి తేమ చేరడం ఆందోళన కలిగిస్తోందని, దీనిపై అధికారులు వెంటనే స్పందించి తగిన విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.