నెల్లూరులో ఆస్తి పన్ను వసూళ్లలో అవినీతి: అధికారుల చేతివాటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలకసంస్థ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముడుపులు ఇస్తే ఒకలా, ఇవ్వకుంటే మరోలా పన్నులు విధిస్తూ అధికారుల చేతివాటం ప్రదర్శిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాణిజ్య భవనాలను నివాసాలుగా చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని, దీనిపై కమిషనర్ ప్రత్యేక నిఘా పెట్టి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.