ఏపీలో 9.09 లక్షల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్ హోదా పొందిన సుమారు 9.09 లక్షల ఎకరాల భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 7.85 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, 1.36 లక్షల ఎకరాల గ్రామసేవా ఇనాం భూములు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన 3.63 లక్షల ఎకరాలపై నిషేధం కొనసాగుతుందని, అక్రమాలపై లోతైన విచారణ జరుపుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.