కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎస్ఎస్‌సీ సీపీఓ నోటిఫికేషన్ విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: New Delhi
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త తెలిపింది. ఢిల్లీ పోలీస్, కేంద్ర బలగాల్లో 1,871 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి ఎస్ఎస్‌సీ సీపీఓ 2026 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.