మహేంద్రగిరి వారాహి నుంచి పవర్‌ఫుల్ సాంగ్ లాంచ్ చేసిన నాగ చైతన్య

రిపోర్టర్: సురేష్ స్థలం: India

సుమంత్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని 'ది రేజ్ ఆఫ్ వారాహి' సాంగ్‌ను నాగ చైతన్య విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం, కడలి సత్యనారాయణ సాహిత్యం సినిమాపై అంచనాలను పెంచాయి. వారాహి మాత దివ్యశక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రం సెప్టెంబర్ 11న గ్రాండ్‌గా విడుదల కానుంది.