రోడ్డు ప్రమాదాల నివారణకు బాపట్ల జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీలు
రిపోర్టర్: సురేష్
స్థలం: బాపట్ల
బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు బాపట్ల పోలీసులు తెలిపారు. రాత్రి సమయాల్లో ప్రయాణించే వాహనదారులను అప్రమత్తం చేస్తూ, హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు ఎంత ముఖ్యమో వివరిస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డు భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖ సూచించింది.