జవహర్నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పాదయాత్రకు భగ్నం: ఈటల రాజేందర్ నిలదీత

రిపోర్టర్: సతీష్ స్థలం: Medchal-Malkajgiri

మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తలపెట్టిన జవహర్నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పాదయాత్రను పోలీసులు భగ్నం చేశారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఘట్కేసర్ మండలం ఏదులాబాద్లో ప్రారంభం కావాల్సిన ఈ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రజల సమస్యలను తెలుసుకునే హక్కును ప్రభుత్వం అణచివేస్తోందని ఈటల రాజేందర్ మండిపడ్డారు. నాడు రేవంత్ రెడ్డి లేవనెత్తిన సమస్యపైనే తాము పోరాడుతుంటే ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.