సౌదీ అరేబియా వైమానిక దాడిపై హౌతీల సంచలన వీడియో విడుదల
రిపోర్టర్: సునీల్
స్థలం: World
సౌదీ అరేబియా, ఇరాన్ మద్దతు ఉన్న హుతీ రెబెల్స్ మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. బాబ్ అల్ మండేబ్ సమీపంలోని మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా వైమానిక దాడి జరిపినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ఆరోపించారు. ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను హౌతీల అధికారిక మీడియా కార్యాలయం విడుదల చేసింది. అయితే ఈ దాడుల్లో ప్రాణనష్టంపై స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు హుతీలతో పోరులో యెమెన్ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాయం కోరింది.