హసనాంబ ఆలయంలో నటి రన్యా రావుకు వీఐపీ దర్శనం: కర్ణాటకలో రాజకీయ కలకలం
రిపోర్టర్: అశోక్
స్థలం: హసన్
బెంగుళూరు విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణా కేసులో నిందితురాలైన కన్నడ నటి రన్యా రావు కుటుంబంతో కలిసి హసనాంబ ఆలయాన్ని సందర్శించడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆమెకు ప్రోటోకాల్ వాహనం కేటాయించడంపై విమర్శలు చెలరేగగా, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. గతంలో ఈడీ చార్జ్షీట్లోనూ ఆమె పేరు ఉండటం గమనార్హం.