అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరుల అరెస్ట్
రిపోర్టర్: సురేష్
స్థలం: Bongaigaon
అస్సాంలోని బొంగాయ్గావ్ రైల్వే స్టేషన్లో సంయుక్త ఆపరేషన్లో తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ నుమాల్ మహట్టా వెల్లడించారు. వారి వద్ద నుంచి నాలుగు జాతీయ గుర్తింపు కార్డులు, ఒక పాస్పోర్ట్, నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రం ద్వారా అస్సాంలోకి ప్రవేశించి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వారు ప్రణాళిక వేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన స్పష్టం చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.