స్థానిక ఎన్నికల వేళ శ్రీకాకుళం జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: శ్రీకాకుళం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో సమస్యాత్మక మరియు అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా పోలీసులు వెల్లడించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నియమ నిబంధనలపై గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు స్పష్టం చేశారు.