గిరిజన విద్యార్థుల భవితకు కరాటే అకాడమీ బాటలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాడేరు

పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మను పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండు రాజు కలిశారు. గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, ఆత్మరక్షణ, భద్రత మరియు క్రమశిక్షణపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

కరాటే శిక్షణతో పాటు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యం, చదువుపై ఆసక్తి పెంపొందించేలా మోటివేషన్ తరగతులు ఉంటాయని పాండు రాజు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఐటీడీఏ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.