గురుగ్రామ్‌లో రోడ్డు రేంజ్ బీభత్సం కార్లతో ఒకరినొకరు ఢీకొన్న వైనం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హర్యానా
హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లోని సెక్టార్ 38 హుడా మార్కెట్ సమీపంలో రోడ్డు వివాదం తీవ్ర రూపం దాల్చింది. బ్లాక్ కలర్ మారుతి బాలెనో కారు, వైట్ కలర్ హ్యుందాయ్ ఆరా క్యాబ్ డ్రైవర్లు ఒకరినొకరు కార్లతో బలంగా ఢీకొంటూ భీభత్సం సృష్టించారు. వైట్ కార్ నుండి కిందకు దిగిన వ్యక్తిని బ్లాక్ కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించగా, అతను తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, పోలీసులు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.