కొండా సురేఖ సంచలన పోస్ట్.. బిగ్ అప్‌డేట్ త్వరలోనే!

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి కొండా సురేఖ, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన తాజా పోస్ట్ కలకలం రేపుతోంది. "ది వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ ఓవర్.. బిగ్ అప్‌డేట్ ఈజ్ కమింగ్ సూన్" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీ వీడి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది.