బెంగళూరులో కూర్చుని రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారంటూ జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, బెంగళూరులో కూర్చుని మాజీ సీఎం జగన్ వైసీపీ రౌడీ గ్యాంగ్‌తో ఏపీలో అరాచకాలు చేయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, ప్రజా ఆస్తుల పరిరక్షణపై సమీక్షించిన ఆయన, లా అండ్ ఆర్డర్‌ను దెబ్బతీయాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.