ఉదయగిరి పాత రహదారిపై కౌంటింగ్ నిమిత్తం కఠిన ఆంక్షలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఉదయగిరి
ఉదయగిరి సీతారామపురం పాత రహదారిపై కౌంటింగ్‌కు వచ్చే అభ్యర్థులు, ఉద్యోగులు, ఏజెంట్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని పోలీసులు తెలిపారు. సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయంగా 167-బీజీ జాతీయ రహదారి మార్గంలో రాకపోకలు సాగించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వాహనదారులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.