దివ్యాంగులకు త్వరితగతిన సదరం సర్టిఫికెట్లు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
యుడిఐడి, సదరం కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సెర్ప్ సిఈఓ దివ్య దేవరాజన్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో యుడిఐడి, సదరం శిబిరాల నిర్వహణను వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.