ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: వాషింగ్టన్

ఇరాన్ తన కీలక లక్ష్యాలను ఉపసంహరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫ్లోరిడాలో విలేకరులతో మాట్లాడుతూ ఇరాన్ అణు స్థావరాలను కేవలం పది నిమిషాల్లోనే నిర్వీర్యం చేయగలమని స్పష్టం చేశారు. చర్చలు కొనసాగుతున్నప్పటికీ వారు నమ్మదగినవారు కాదని, అవసరమైతే సైనిక చర్యకు వెనుకాడేది లేదని స్పష్టం చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ పరిణామంతో మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి.