హైదరాబాద్ లో వర్షపు నీటి సంరక్షణపై రంగ ప్రసాద్ అద్భుత పోరాటం
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
హైదరాబాద్ లో నీటి ఎద్దడి సమస్యకు పరిష్కారంగా రంగ ప్రసాద్ స్వయంగా వర్షపు నీటి సంరక్షణ గుంతల నిర్మాణం చేపట్టారు. గచ్చిబౌలిలో మొదలైన ఈ ప్రయాణం దశాబ్ద కాలంలో ఆరు వందలకు పైగా రీఛార్జ్ సిస్టమ్ ల ఏర్పాటుకు దారితీసిందని ఆయన తెలిపారు. ప్రజల్ లో అవగాహనతో పాటు ఆచరణాత్మక నైపుణ్యాలు కూడా అవసరమని రంగ ప్రసాద్ పేర్కొన్నారు. నగరంలో భూగర్భ జలాల పెంపునకు తన సంస్థ ద్వారా విశేష కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.