కొలువుల కోసం రోడ్డెక్కిన నిరుద్యోగ జ్వాలల ఆక్రోశ గర్జన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఏటూరునాగారం

ఏటూరునాగారంలో నిర్వహించిన డీవైఎఫ్ఐ ములుగు జిల్లా మహాసభలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో పాలకుల వైఫల్యం చెందారని మండిపడ్డారు. తక్షణమే ఖాళీ పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతితో పాటు స్వయం ఉపాధి రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల యువతను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.