తెలుగు తెరపైకి రానున్న ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

ఐదు దశాబ్దాల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న ప్రఖ్యాత నటుడు నసీరుద్దీన్ షా తొలిసారిగా తెలుగు తెరపై కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి 2 చిత్రంలో ఆయన ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇప్పటికే పలు భాషల్లో విశేష ప్రేక్షకాదరణ పొందిన ఆయన, ఈ చిత్రంలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.