గుంతకల్లులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంట భారీ దోపిడీ

రిపోర్టర్: వెంకట్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా గుంతకల్లు కోయనగర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మనోజ్ కుమార్ ఇంట్లో దుండగులు బీభత్సం సృష్టించారు. తాగునీరు కావాలంటూ లోపలికి చొరబడి పసిపాప మెడపై కత్తి పెట్టి భయపెట్టి సుమారు రూ.60 లక్షల విలువైన బంగారు నగలు, నగదును దోచుకెళ్లారు. బాధితురాలు నివేదిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు ప్రారంభించి పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.