'ఉద్యోగులకు షాక్': భారత్‌లో ఒరాకిల్ భారీ లేఆఫ్స్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: భారతదేశం
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ భారత్‌లో మరోసారి భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ లేఆఫ్స్ చేపట్టినట్లు తెలుస్తోంది. వెబ్ డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్ విభాగాలతో పాటు క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉద్యోగులపై దీని ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.